1 rupee idli coimbatore
1 rupee idlicoimbatore

80 Year’s old Women sells Idly for one rupee in Coimbatore

Spread the love

 

సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ ఉండల్సిన  అక్కర్లేదు. మంచి మనసుంటే చాలని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ.

తాటి గుడిసెలో రూపాయికే ఇడ్లీ  (1 rupee idli Coimbatore In Telugu) విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. డబ్బులో దొరకని ఆత్మసంతృప్తి ఒకరి కడుపు నింపడంలో దొరుకుతోందని చెబుతోంది ఆ బామ్మ.

 

తమిళనాడులోని తిరువరూర్- నారమంగళం గ్రామానికి చెందిన కమల పట్టి (85)కి 50 ఏళ్లుగా హోటలే జీవనాధారం. హోటల్ అంటే మన నగరాల్లో నడిపినట్టుగా రంగురంగుల లైట్లు, టేబుళ్లు, డిజైన్లతో కూడిన ప్లేట్లు ఉండవు. పాండయచూర్ నదీ తీరాన.. ఓ చిన్ని తాటాకు గుడిసె ఆమె హోటల్. వెడల్పాటి పచ్చని ఆకులే ఆ హోటల్‌లో ప్లేట్లు. పెద్ద బండరాళ్లే అక్కడ కుర్చీలు, టేబుళ్లు. ఏ హంగూ లేకపోయినా ఇతర హోటళ్లకు లేని ప్రత్యేకత కమలమ్మ హోటల్ సొంతం. అదే.. రూపాయి ఇడ్లీ.

కమలమ్మ హోటల్‌లో ఒక్క రూపాయికే ఒక ఇడ్లీ లేదా దోసె తినొచ్చు. 

గ్రామంలోని రైతులు, పేదలు.. ఉదయాన్నే ఓ పది రూపాయలు పట్టుకొచ్చి కడుపు నిండా పది ఇడ్లీలు, దోసెలు తిని పొలం పనులకు పయనమవుతారు. అయితే, కరోనా కాలంలో పెరిగిన ధరలు పట్టించుకోకుండా ఇప్పటికీ రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తోంది కమలమ్మ. ఆదాయం కోసం పాకులాడకుండా, అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపుతున్న కమలమ్మకు గ్రామస్థులు సలాం చేస్తున్నారు.

‘‘50 ఏళ్లుగా ఈ బామ్మ ఇక్కడే రూపాయి కే ఇడ్లీ, దోసె “

నా లాంటి పేదలు కేవలం రూ.10లకే ఆకలి తీర్చుకోవచ్చు. బయట పెద్ద హోటళ్లకు వెళ్తే… ఒక్కో దోసెకు రూ.35-రూ.50 చెల్లిస్తాం. కానీ, ఇక్కడ అలా కాదు’’ అంటున్నాడు ఆ గ్రామస్థుడు. తనకు డబ్బులో లభించని ఆత్మ సంతృప్తి పేదల ఆకలి తీర్చడంలోనే దొరుకుతుందంటోంది కమలమ్మ. అందుకే, రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తానంటోంది. ‘‘మా అమ్మ 50 పైసలకే ఓ దోస/ఇడ్లీ అమ్మి మమ్మల్ని పోషించింది. ఆమె మరణించాక నేను ఈ వ్యాపారం చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నాను. ఒకరి ఆకలి తీర్చితే మనసుకు తృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి ఏ సంపాదన వల్ల వస్తుంది?’’ అంటోంది ఈ ముసలావిడ. నిజంగా ఈమెకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

నేను చనిపోయే దాకా 1రూపాయికే ఇడ్లీ అమ్ముతా.
ఎప్పటికీ ధర పెంచను- కమలాతాల్

ఇలా ఏంత మంది ఉంటారు.. లక్షకు ఓక్కరు ఉంటారో ఉండరో తేల్వదు గాని నేటి వారిమైన మనం ఈ అమ్మ’ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని…

ఇప్పుడు మనం 2019లో ఉన్నాం. ఇప్పటికీ మా ఊరిలో రూపాయికే ఇడ్లీ దొరుకుతోంది. 10 రూపాయలతో కడుపునిండా తినొచ్చు. కొన్నిసార్లు మా దగ్గర డబ్బులు లేకున్నా ఆ బామ్మ ఏమీ అనరు. నా జేబులో రూ.500 ఉన్నా సరే, ఇక్కడే ఇడ్లీ తింటాను” అన్నారు వడివెలంపాలయం గ్రామానికి చెందిన రామసామీ.

“రోజూ పొద్దున 5.30 గంటలకు నిద్రలేస్తాను. చట్నీ, సాంబార్ చేస్తా. 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి” అని చెప్పారు.

 

ఈ వయసులోనూ బామ్మ రుబ్బురోలును వాడుతున్నారు. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని ఆమె అంటున్నారు.
“నేను రాగి జావ తాగేదాన్ని. అలాంటి ఆహారం తినడం వల్లే నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్నం తింటున్నారు. కానీ, బియ్యంలో సరైన పోషకాలు ఉండవు” అని ఆమె అన్నారు.
సాధారణంగా తమిళనాడులో ఒక ఇడ్లీ ఖరీదు రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కానీ, ఈ బామ్మ ఒక్క రూపాయికే ఇడ్లీ ఇవ్వడం అందరినీ ఆలోచించపజేస్తోంది.

“మా ఊరి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ ఉండే హోటళ్లలో ఒక్క దోశ తింటే 25 రూపాయలు అవుతాయి. అది తిన్న గంటలోపే మళ్లీ ఆకలేస్తుంది. అవే డబ్బులతో ఇక్కడ ఇడ్లీ కడుపునిండా తొనొచ్చు. మధ్యాహ్నం దాకా ఆకలి బాధే ఉండదు” అక్కడి  గ్రామస్థుడు సెల్వ సుందరం వివరించారు.

ఈ బామ్మ చేసే ఇడ్లీలు, చట్నీ, సాంబార్ కూడా భలే రుచికరంగా ఉంటాయని మరో గ్రామస్తుడు  రామసామీ అంటున్నారు.

1 rupee idli Coimbatore In Telugu

 

 

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *