babai hotel vijayawada
babai hotel vijayawada

babai hotel vijayawada

Spread the love

76 ఏళ్ల చరిత్ర గల  విజయవాడ  బాబాయ్ హోటల్    (babai hotel vijayawada )  ప్రస్థానం :

 

విజయవాడ గాంధీనగర్ వైపు వెళ్లిన వారు బాబాయ్ హోటల్ లో  (babai hotel vijayawada ) టిఫిన్ చేయకుండా ఉండలేరు

ఈ హోటల్ 1942 లో చిన్న పూరి పాకలో మొదలైంది బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే సాంబశివరావు గారు దీనిని ప్రారంభిచారు నోట్లో వేస్తే ఇట్లే కరిగిపోయే ఇడ్లి ఇక్కడ చాలా ఫెమాస్

ఈ ఇడ్లి అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం నగరానికి వస్తే ప్రత్యేకంగా ఇక్కడి ఇడ్లి తెప్పించుకుని తినేవారు అంతేకాకుండా ఈ హోటల్ ప్రాముఖ్యత గ్రహించిన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి సాంబశివమూర్తి కి ఒక ప్రశంసా పత్రాన్ని అందించారు అప్పట్లో కొందరు సినీ నటులు షూటింగ్ నిమిత్తమై విజయవాడ వస్తే ఇక్కడే టిఫిన్ చేసేవారట

1985 లో సాంబశివమూర్తి గారు మరణించారు తరువాత వాళ్ళ కుమారులు ఈ హోటల్ ని కొనసాగిస్తున్నారు

బాబాయ్ హోటల్ లో ( babai hotel vijayawada ) ఇడ్లి చాలా ఫెమాస్ ఇవి మృదువుగా ఉంటాయి . వాటిపై   వెన్న నెయ్యి వేసి కొంచెం పప్పుల పొడి జోడించి రెండు రకాల చట్నీలతో ఒకటి కొబ్బరి చట్నీ ఒకటి పల్లీల చట్నీ తో వడ్డిస్తారు ఈ ఇడ్లి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది

ఇక్కడ రక రకాల దోసెలు అనేక ఫ్లేవర్స్ లో లభిస్తాయి అన్ని కూడా చాలా క్రిస్పీ గా తయారు చేస్తారు

ముఖ్యంగా ఇక్కడ మాసాల దోస చాలా ఫెమాస్ మసాలా లో ఉల్లిపాయ ఆలు కూరతో తో పాటు నెయ్యి జోడించి పప్పుల పొడి రెండు రకాల చట్నీలతో వడ్డిస్తారు

బోజనాన్ని వ్యాపారం గా కాకుండా వచ్చిన కస్టమర్లకు ప్రేమతో నిండు మనసుతో వడ్డించేవారు

ఈ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా  స్వీట్ షాప్ స్టయిల్ కలాకండ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోవచ్చు 

అదే ఆయన వ్యాపార సామ్రాజ్యానికి మంచి పునాదీని వేసింది

ప్రజల్లో ఆయన భోజన శాలకు బాబాయ్ హోటల్ అనే పేరును తీసుకొచ్చింది

బాబాయ్ హోటల్ అంటే ఇది తెలుగు వారి హోటల్ అనే ప్రచారం లో మన్ననలు పొందింది

సందుకు 10 ఆహార హోటల్ లు వెలిసే ఆహారాన్ని వ్యాపారంగా చూసే ఈ రోజుల్లో మనుషులు ఈ ఘటన సాధించాలి అంటే యుగాలు పడుతుంది అంటారు బాబాయ్ హోటల్ అభిమానులు

అంతటి ఘనత చెందిన ఈ హోటల్ ఫ్లేవర్ ను అదేవిధంగా అంటూ కార్పొరేట్ వ్యవస్థ హోటల్ లు కూడా కాపీ కొట్టేసాయి

ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు వింటే అక్కడ బాబాయ్ హోటల్ ఇడ్లి పేరుతో వడ్డించడము ప్రారంభించాయి , బయట దేశాల తెలుగు వారు ఇదొక బ్రాండ్ గా పరిగణించడం ప్రారంభించారు

ఇక్కడి భోజన ప్రియలు ఈ ఆహారములోని కమ్మదనాన్నీ ఆస్వాదిస్తూ లొట్టలు వేసుకొని తింటున్నారు

గోధుమ రవ్వ ఉప్మా పెసరట్టు , ఉప్మా మినపట్టు , వేడి వేడి రైస్ పొంగల్ ఇక్కడ ప్రత్యేకత

ఇక్కడ అందించే అల్పాహారం నాణ్యమైనది గా ఉండడం ఇడ్లి లలో మినప్పప్పు ఎక్కివగా వాడటం వంటివి చేయడం వల్ల చాలా మృదువుగా గా ఉంటాయి అని నిర్వాహకులు చెప్తున్నారు

బాబాయ్ హోటల్ కి (babai hotel vijayawada ) వచ్చే కస్టమర్లను మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ వడ్డిస్తుంటారు

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా బాబాయ్ హోటల్ పూర్తీ వివరాలు పొందవచ్చు 

ఫోటో సేకరణ : రాదా ప్రసాద్ (పేస్ బుక్ )

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *