Famous food of Andhra Pradesh
Famous food of Andhra Pradesh

Famous food of Andhra Pradesh Godavari districts

Spread the love

Famous food of Andhra Pradesh Godavari districts

 

ఈ సంక్రాంతికి గోదావరి జిల్లా లకి వెళ్తున్నారా?.. లేదంటారా..! ఎలాగైనా తీరిక చూసుకుని వెళ్లండి ఏదో ఏడాదికి ఒక్క మారు… మీరు మన  తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి  జిల్లాలకి వస్తే మాత్రం ఈ కిందనున్న రుచులను (Famous food of Andhra Pradesh Godavari districts) మాత్రం రుచి చూడకుండా వదలకండి… ఎం అంటారు?

రోడ్డు పై వెళ్తుంటే చుట్టూ పంట పొలాలు పొడవైన కొబ్బరి చెట్లు మధ్యలో ప్రయాణం చేస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాంటి అందమైన దృశ్యాలకి నిలయమే కోనసీమ ,ఇలాంటి అందమైన దృశ్యాలతో పాటు మంచి ప్రసిద్ధ చెందిన వంటకాల రుచులకు పెట్టింది పేరు కోనసీమ

ఏదైనా ఒక వంటకాన్ని రుచి చూసినప్పుడు మన మనసుకి హత్తుకుంటుంది వాటిలో కొన్నింటిని గురించి ఇప్పుడు   మాట్లాడుకుందాం

 

 

 

కాకినాడ గొట్టం కాజా :

కాకినాడ కాజా అనగానే మనకు గుర్తుకు వచ్చేది గొట్టం కాజా కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయో తెలియనట్టు ఈ కాజా లో జ్యుస్ ఎలా వస్తుందో కూడా తెలియదు నెయ్యితో వేసి పాకం పట్టిన ఈ కాజా లు నోట్లో పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి

కాకినాడ లో కోటయ్య స్వీట్ షాప్ లో మొదట గా ఈ కాజా తయారైంది

 

 

 తాపేశ్వరం మడత  కాజా :

తాపేశ్వరం మడత కాజా 1939 లో మొదటి మడత కాజా తయారుచేసి ఖ్యాతి పొందిన ప్రముఖుడు పొలిశెట్టి సత్తిరాజు

తాపేశ్వరం పేరు చెప్పగానే నోటిలో నీళ్లు ఊరే మడత కాజా గుర్తొస్తుంది చూడగానే తినాలి అని అనిపిస్తుంది వేడి వేడి కాజా నుండి సర్రున పాకం కారుతుంటే సర్రున నోట్లోకి పోవాల్సిందే

మామిడి తాండ్ర కూడా ఎటువంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన తాండ్ర తయారు చేస్తారు

 

 

కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో విందు :

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అనేది ఒకప్పుడు మాట కానీ ఇక్కడ మాత్రం తింటే సుబ్బయ్య హోటల్ లో నే తినాలి ఆత్మీయంగా పాలకరింపులతో మొదలై ఆప్యాయంగా అరటి ఆకులో అరడజను వంటకాలు వడ్డిస్తారు కడుపునిండా తిన్నామనే సంతృప్తి కలుగక మానదు

 

 

గంగరాజు పాలకోవా – రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం స్వీట్స్ అనగానే గంగరాజు పాలకోవే ముందు గుర్తుకువస్తుంది స్వచ్ఛమైన గేదె పాలతో తక్కువ శాతం పంచదార వేసి రుచికరమైన పాలకోవ ని చేస్తారు పెద్ద పట్ణాల్లో నివశించే ప్రజలకు ఈ కోవా అంటే మక్కువ ఎక్కువే

 

 

రోజ్ మిల్క్ –రాజమండ్రి

రోజ్ మిల్క్ ఈ శీతల పానీయం చాలా చోట్ల లభిస్తుంది కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వచ్ఛమైన కోవా తో ఈ మిల్క్ తయారు చేస్తారు ఎటువంటి కెమికల్స్ కలుపకుండా స్వచ్ఛమైన పాలతో వీటిని తయారు చేస్తారు రోజ్ మిల్క్ అనే పేరు తో అనేక షాప్ ఉన్న స్టేషన్ దగ్గర లోని రోజ్ మిల్క్ అనే పేరుతో వుండే దుకాణం ఏ ప్రాముఖ్యమైనది

 

 

ఆత్రేయపురం పూతరేకులు :

ఆత్రేయపురం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పూత రేకులు నేతితో చేసిన ఈ పూతరేకులు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అంత రుచికరమైన పూతరేకులు మనకి ఒక్క ఆత్రేయపురం లో నే లభిస్తాయి

ఈ పూతరేకుల వివిధ రకాల ఫ్లేవర్స్ లో ఇక్కడ తయారుచేస్తారు వాటిలో కొన్ని బెల్లం పూత రేకులు, షుగర్ పూత రేకులు , డ్రై ఫ్రూట్ పూత రేకులు, కోవా పూతరేకులు

ఇవే కాకుండా మామిడి తాండ్ర కూడా ఇక్కడ ప్రసిద్దే

 

 

అప్పలరాజు గారి మిలిటరీ భోజన హోటల్ లో నాన్ వెజ్ భోజనం – ఏలూరు

100 ఏళ్ళు చరిత్ర గల ఈ హోటల్ రుచికి కేరాఫ్ చిరునామా గా మారింది భోజనం కూడా అంతే రుచిగా ఉంటుంది మీరు మాంసాహారం ప్రియులు అయితే తప్పక ట్రై చేయండి

 

 

అంబాజీ పేట పొట్టిక్కలు:

అల్పాహారం లో ఎప్పుడు తినే ఇడ్లి దోశ కాకుండా ఈ పొట్టికలును అల్పాహారం గా తయారుచేస్తారు . ఇది కూడా ఇడ్లి పిండి తో పనస ఆకు బుట్ట లా కట్టి తయారు చేస్తారు . దీన్ని ఒక ఆయుర్వేద ఫుడ్ గా భావిస్తారు దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అంబాజి పేట్ వెళ్లి నప్పుడు తప్పక ట్రై చేయండి

 

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా హైదరాబాద్ లో హైదరాబాది ఒరిజనల్ బిర్యానీ దొరికే  రెస్టారెంట్లను తెలుసుకోవచ్చు 

 

కాకినాడ కోటయ్య గొట్టం కాజా :

ఈ కాజాకి దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉంది తెనాలి నుండి వచ్చిన చిట్టి పెద్ది కోటయ్య ఈ కాజా ను తొలిసారి తయారు చేశారు

ఈ కాజ ప్రత్యేకత ఏంటంటే కాజా లోపల జ్యుస్ లా పాకం ఉంటుంది , ఇవి తింటుంటే హ పాకం లోని తియ్యదనం ఆహా అనేలా చేస్తుంది

 

 

నగరం గరాజీలు :

ఇవి నగరం లో తయారు చేస్తారు వీటినే పిచ్చుక గూళ్ళు అని కూడా అంటారు ఇవి మన ఇళ్లలో చేసుకునే చిన్న చక్రాలు లేదా మురుకులు వాలే ఉంటాయి రుచి చాలా అద్భుతంగా ఉంటాయి

 

 

 

రావుల పాలెం కుండ బిర్యానీ :

హైదరాబాద్ కి ధమ్ బిర్యానీ లు ఎంత ఫెమస్ హో అంతే ప్రాముఖ్యత కలిగినది ఈ రావులపాలెం కుండ బిర్యానీ , నాణ్యమైన బాస్మతి బియ్యం మసాలా లతో దట్టించి చేస్తారు వేడి వేడిగా కుండలో వేసి జీడిపప్పు తో ఇస్తారు బయట బిర్యానీలు తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఇదిట్రై చేయండి ఒక్కసారి తింటే మల్లి ఎప్పుడు రావులపాలెం మీదుగా వెళ్లినా తినాలి అనిపిస్తుంది

 

 

చీరమీను :

గోదావరి ప్రవాహం వద్ద ఇవి ఎక్కువ గా దొరుకుతాయి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇవి చీర వేసి పట్టుకుంటారు అందుకే వీటిని చీరమీను అంటారు ఇవి ధర కొంచెం ఎక్కువ గా ఉన్న రుచికి ఏమాత్రం తీసిపోవు వీటిని పులుసు గా కానీ గారెలలో కానీ వేసి వండుతారు

 

 

గోదావరి పులస చేప :

పుస్తెలు అమ్మి ఆయిన పులస చాప తినాలి అని సమేత ఉంది నిజంగా అంతే రుచిగా ఉంటుంది నాశిక్ లో పుట్టి గోదావరి లో ఎదురుగా వీదుతుంది రుచికి చాలా అమోఘమైన రుచి ఉంటుంది

 

 

మండపేట బెల్లం గవ్వలు :

ఈ గవ్వలు బియ్యం పిండి ఉపయోగించి చేసిన చాలా మెత్తగా ఉంటాయి బెల్లం పాకం పట్టించి చేస్తారు కాబట్టి హెల్దీ గా రుచిగా వుంటాయి

 

 

మామిడాడ మామిడి తాండ్ర :

చిన్న పెద్ద అందరికి దీన్ని చూడగానే నోరు ఊరుతుంది ఇది అన్ని శుభకార్యాలలో వడ్డిస్తారు రుచికి చాలా బాగుంటుంది అనేక ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది కానీ మామిడాడ దీనికి ప్రసిద్ధి

 

 

బెల్లం పూడి జీడు లు :

చిన్నప్పుడు ఏదైనా జాతరకు వెళ్ళినప్పుడు బండ్లపై నూగు జీడులు చూసి వుంటారు ఈ జీడులు ఇక్కడ తయారైనవే ఇవి బెల్లం జీడులు పంచదార , నువ్వులు జీడులురకాలుగా తయారు చేస్తారు ఇవి తింటుంటే బాల్యం గుర్తుకు వస్తుంది

 

 

బొబ్బరాలంక కొబ్బరి ఉండలు :

మనం ఎన్ని రకాలు స్వీట్స్ బయట తిన్నా కానీ ఈ కొబ్బరి వుండలకు మాత్రం వుండే ప్రత్యేకతే వేరు సాంప్రదాయ వంటకాల్లో వీటికి ఒక ప్రాముఖ్యత ఉంది

 

 

పెరుమల్లపురం పాకం గారెలు :

మాములు గారెలు మనం బయట టిఫిన్స్ గా చేసి ఉంటాం కానీ ఈ గారెలు ప్రాముఖ్యత ఉంది వీటిని బెల్లం లేదా పంచదార పాకం పడతారు గారెలలో కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి

 

 

కత్తిపూడి కరకాజం: 

వీటిని బూందీతో చెక్కలు గా చేస్తారు, రుచికి తియ్యగా ఉంటుంది , కత్తిపూడి దీనికి చాలా ప్రసిద్ధి

 

 

బొంగులో చికెన్ – మారేడుమిల్లి

దీనినే బొంభో చికెన్ గా పిలుస్తారు వెదురు బొంగులో మసాలా పిండి పట్టించిన చికెన్ ముక్కలను మంటపై కాలుస్తారు బొంగులు బాగా నల్లగా అయ్యేవరకు కాల్చి తీస్తారు ఇది చాలా రుచిగా ఉంటుంది

ఇంతే కాదండోయ్… పులస చేప పులుసు, ఆవకాయ పచ్చడి, భీమవరం రొయ్యల వేపుడు, బొమ్మిడైల కూర ఇలా ఎన్నో ఉన్నాయి… మరి ఈ సంక్రాంతికి మన గోదారి ఊళ్లకు వచ్చి టేస్ట్ చేసేయండి మరి…😉

Famous food of Andhra Pradesh Godavari districts

Photo Source : Vasavi Sri Fb wall 

 

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *