Hotels in Guntur -Telugu Foodies World
Hotels in Guntur

Famous Food and Best Hotels In Guntur

Spread the love

గుంటూరు అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఘాటైన మిర్చి .ఎన్నోరకాల మిర్చ్చి లభించే అతిపెద్ద మిర్చియార్డ్ గుంటూరులోనే వుంది . ఈ ఘాటుకు  దీటుగా ఇక్కడ కొన్ని రకాల ఆహారాలు కూడా ప్రసిద్ధమే మరి అవి ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దామా (Hotels in Guntur )

మీరు గుంటూరు లో మంచి ఫుడ్ గురించి వెతుకుతుంటే ఈ ఆర్టికల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది

గుంటూరు లో ప్రసిద్దమైన ఆహారాలు అవి లభించే ప్రముఖ హోటళ్ళు మరియు రెస్టారెంట్లు ఇవే Hotels in Guntur :

 

1.శంకర్ విలాస్ :

70 ఏళ్ల చరిత్ర గలిగిన ఈ హోటల్ గుంటూరు నడిబొడ్డున ఉంటుంది ఈ హోటల్ వలన ఒక చిన్న ప్రాంతం ని శంకర్ విలాస్ సెంటర్ అని పేరు పెట్టి పిలుస్తారు అంటే అతి సయోక్తి కాదు

ప్రసిద్ధి – టిఫిన్స్ , భోజనం

అడ్రస్ – 4/1 బ్రాడిపేట్ , 3 వ లైన్ బ్రాడిపేట్

 

2.మద్రాస్ బిలాల్ బిర్యానీ :

గుంటూరు లో మంచి ధమ్ బిర్యానీ ట్రై చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే

ఫేమస్ – చికెన్ బిర్యానీ

అడ్రస్ – పోతూరి వారి తోట , 3 వ లైన్ గుంటువారి తోట

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా నిజామాబాద్ లో గల ప్రముఖ హోటళ్ళను మరియు ప్రసిద్ద ఆహారాలను తెలుసుకోవచ్చు 

 

3. హోటల్ శుభాని :

కిచిడి ప్రియులు ఉంటే తప్పక ట్రై చేయండి , కిచిడి తో పాటు గడ్డ పెరుగు చట్నీ , గోంగూర, సాంబార్ వేసుకొని లాగించేయొచ్చు

ఫేమస్ – కిచిడి

అడ్రెస్ – గుంటూరు మిర్చి యార్డ్ పక్కన , సీతారాం నగర్

 

4.కొత్తపేట శుభాని మాల్ పూరి :

నెయ్యితో తయారు చేసిన మాల్ పూరి లో రుచికరమైన కోవా వేసి ఇస్తారు లోట్టలేసుకుంటూ తినేయవచ్చు
సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది

ఫేమస్ – మాల్ పూరి

అడ్రెస్ – కొత్తపేట బాబురావు హాస్పిటల్ దగ్గర , విజయ థియేటర్ ఎదురు లైన్

 

5.పట్టాభిపురం వంకాయ బజ్జి :

40 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ బజ్జి ఒక చిన్న బండి పై ఇవి ఇక్కడ మనకు లభిస్తాయి

ఫేమస్ – వంకాయ బజ్జి

అడ్రస్ – పట్టాభిపురం పాత ఆర్ టి ఓ ఆఫీస్ రోడ్ గల వివేకానంద బొమ్మ వద్ద

 

6.పిజ్జా వరల్డ్ :

మీరు పిజ్జా ప్రియలు అయితే ఇక్కడ ట్రై చేయండి

ఫేమస్ – పిజ్జా

అడ్రస్ -హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ కింద , లక్ష్మీపురం

7.గుంటూరు గోంగూర రెస్టారెంట్ :

మటన్ ఫుడీ అయ్యుండి కాస్త డిఫరెంట్ గా ఇక్కడ ట్రై చేయొవచ్చు

ఫేమస్ – గోంగూర చికెన్ , మటన్

అడ్రస్ -7 వ లైన్ , శృతి హాస్పిటల్ దగ్గర , బృందావన్ గార్డెన్స్

 

8.చిట్టి ఇడ్లి :

ఎప్పుడు తినే రొటీన్ ఇడ్లి బోరుకోడితే ఇక్కడ ట్రై చేయండి గోలి కాయల్లాంటి చిన్న ఇడ్లిలు2 నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఫేమస్ – చిట్టి ఇడ్లి

అడ్రెస్ – బ్రాడిపేట్ 5/7 , హనుమాన్ టిఫిన్ సెంటర్ , సిండికేట్ బ్యాంక్ వెనుక వైపు

9.ఆనంద్ భవన్ :

1951 సంవత్సరం నాటి హోటల్ , రుచికరమైన టిఫిన్స్ భోజనం మంచి నాణ్యత తో అందిస్తారు

ఫేమస్ – టిఫిన్స్ , భోజనం

అడ్రస్ – బ్రాడిపేట్ మెయిన్ రోడ్ ఆరండల్ పెట్

10.వరలక్ష్మీ  టిఫిన్స్ :

రకరకాల దోసెలు ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ దొరుకుతాయి టమోటా దోస , క్యారెట్ దోస ఇలా అనేక రకాల దోసలు లభిస్తాయి

ఫేమస్ – బీట్ రూట్ దోశ , టమోటా దోస

అడ్రస్ – చంద్రమౌళి నగర్ , లైన్ 6

 

11.డిలైట్ దాబా  :

పిల్కా తో పాటు కొన్ని రకాల చికెన్ కర్రీలు కొన్ని స్టారర్ లు ట్రై చేయవచ్చు

ఫేమస్ – పుల్కా & పంజాబీ చికెన్ కర్రీ

అడ్రస్ – స్పెన్సర్ దగ్గర , ట్రంక్ రోడ్డు , ఎర్రబాలెం రోడ్ మంగళగిరి ,గుంటూరు

12. విజయ కూల్ డ్రింక్స్ అండ్
ఫ్రూట్ మిల్క్ :

అన్నిరకాల మిల్క్ షేక్ లు జ్యుస్ లు నాణ్యత గా అందజేస్తారు

ఫేమస్ – డ్రై ఫ్రూట్ మిల్క్ & బటర్ మిల్క్

అడ్రెస్ -ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ , బృందావన్ గార్డెన్స్ రోడ్ లక్ష్మీ పురం

13.బిస్మిల్లా బిర్యానీ :

ధమ్ బిర్యానీ తో పాటు కొన్ని కబాబ్స్

ఫేమస్ – బిర్యానీ

 

14.స్వగృహ స్వీట్స్ :

అన్ని రకాల పిండి వంటలు మన ఇంట్లో చేసుకునే రుచితో లభిస్తాయి

ఫేమస్ – గీ మైసూర్ పాక్ , బొబ్బట్లు

అడ్రస్ – రోడ్ నెంబర్ 10 , ఆరండల్ పెట్ , గుంటూరు

Photo Credit : Zomato,Swiggy ,Justdail

Hotels in Guntur

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *