restaurants in rajahmundry -Telugu Foodies World
restaurants in rajahmundry

Best Food and restaurants in Rajahmundry

Spread the love

రాజమండ్రి నే రాజమహేంద్రవరం వరం అని కూడా పిలుస్తారు సంస్కృతి సాంప్రదాయాలకు కి రాజధాని చిహ్నం ఈ రాజమండ్రి . రాజమండ్రి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పుష్కర్ ఘాట్, గోదావరి వంతెన . ఒక ప్రక్క గోదావరిలో లో నీరు జల జల ప్రవహిస్తుంటే గోదారి ఒడ్డున కమ్మనైన్ రుచులతో నోరుఊరిస్తుంటాయి .రుచికరమైన సంప్రదాయ వంటకాలకు రాజమండ్రి ఎంతో ప్రసిద్ధి . మరి హ రుచులేంటో చూద్దామా  (restaurants in Rajahmundry)…

రాజమండ్రి లో గల కొన్ని ప్రముఖ వంటలు అవి లభించే ప్రదేశాలు ఇవే : Best Food and restaurants in Rajahmundry :

 

 

శ్రీ కన్యా – నాన్ వెజ్: 

రాజమండ్రి లో మాంసాహారం ఇష్టపడే వాళ్లకు బెస్ట్ ప్లేస్ ఇదే. రక రకాల బిర్యానీ లు , రకరకాల మాంసాహార వంటలతో అద్భుతమైన రుచితో అందిస్తుంది

ఫేమస్ – స్పెషల్ చికెన్ బిర్యానీ , చికెన్ స్టాటర్స్

అడ్రస్ – రిలయన్స్ మార్ట్ పక్కన శేషయ్య మెట్ట , రాజమండ్రి

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా వైజాగ్ లో గల ప్రముఖ రెస్టారెంట్లను తెలుసుకోవచ్చు 

బర్కస్ – మండి

మసాలా బిర్యాని లు తిని కొత్త రకమైన బిర్యానీ కోసం చూస్తున్న వాళ్లకు బెస్ట్ ప్లేస్ ఇది . పెద్ద ఆకారం వుండే ప్లేట్లో నిండా నెయ్యితో వండిన బిర్యాని వేపిన ఉల్లిపాయ ముక్కలు డ్రై ఫ్రూట్ చల్లి , మంటల పై కాల్చిన చికెన్ ముక్క తో ఇస్తారు

ఫేమస్ – చికెన్ , మటన్ మండి

అడ్రస్ – రౌండ్ పార్క్ రోడ్డు వద్ద , ప్రకాశం నగర్ రాజమండ్రి

ఆవకాయ రెస్టారెంట్ :

ఇక్కడ సాంబార్ ఇడ్లి దోశ తో పాటు 4 రకాల చట్నీలు ఆవకాయ తో వడ్డిస్తారు. గోదావరి బ్రిడ్జ్ ఆహ్లాదకరమైన వాతావరణం లో హాయిగా తినేయొచ్చు

ఫేమస్ – సాంబార్ ఇడ్లి , ఆవకాయ వంటలు

అడ్రస్ – త్యాగరాజ నగర్

స్ట్రీట్ వెండర్స్ – టమోటో బజ్జి

చాలా ప్రదేశాల్లో బండ్ల పై దొరికే టమోటో బజ్జి ప్రసిద్ధి చెందిన రుచికరమైన వంటకం

హోటల్ విజయ్ అమృత:

అల్పా హారం( టిఫిన్స్ ) లభించే ప్రముఖ హోటళ్ల లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది మిగతా వాటితో పోల్చితే ధర కొంచెం ఎక్కువ అయిన ధర కి తగ్గ రుచి ఉంటుంది ఇక్కడ నార్త్ ఇండియా టిఫిన్స్ కూడా లాభిస్తాయి

ఫేమస్ – టిఫిన్స్

అడ్రస్ – వెంకటప్ప రావు రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎదురు, ప్రకాష్ నగర్

 

కోవా గంగరాజు డైరీ

కోనసీమ కోవా కి పెట్టిందే పేరు స్వచ్ఛమైన పాలతో తయారు చేసే ఈ కోవా చాలా ప్రసిద్ధి గాంచింది , లీటర్ పాలలో వంద గ్రాముల పంచదార మాత్రమే వేసి అమోఘమైన రుచితో తయారు చేస్తారు

ఫేమస్ – కోవా

అడ్రస్ – కొక్కొండ వారి వీధి , త్యాగరాజ నగర్ రాజమండ్రి

ARTOS లోకల్ కూల్డ్రింక్స్

కేవలం ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే కూల్ డ్రింక్ ఇది . పాత కాలం నాటి చరిత్ర గల శీతల పానీయం .వందేళ్లు చరిత్ర గల పేదోడి కూల్ డ్రింక్ గా పిలుస్తారు

అడ్రస్ – అన్ని రకాల కూల్ డ్రింక్ షాపుల్లో లభ్యమవుతుంది

ఈట్ & ప్లే రెస్టారెంట్ :

వారం చివర్లో ఎక్కడైనా కుటుంబం తో కలిసి భోజనం చేయాలి అనుకునే వాళ్లకు బెస్ట్ ప్లేస్ ఇది, ఇక్కడ వెజ్ మరియు నాన్ వెజ్ రెండు లభిస్తాయి

ఫెమస్ – వెస్ట్రన్ పుడ్ , బర్గర్ , పిజ్జా

రోజ్ మిల్క్ :

రోజ్ మిల్క్ ఇవి మనకు చాలా చోట్ల దొరుకుతాయి కానీ ఇక్కడి ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే స్వచ్ఛమైన కోవాతో ఈ మిల్క్ చేస్తారు ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగలనిపించే లా ఆమోగగంగా ఉంటాయి చాలా చోట్ల ఈ రోజ్ మిల్క్ పేరు తో సెంటర్ లు ఉన్న ఇక్కడ రోజ్ మిల్క్ మాత్రం ప్రత్యేకం

ఫేమస్ – రోజ్ మిల్క్

అడ్రస్ – మెయిన్ రోడ్ ss మాల్ ఎదురుగా , మంగలవారి పేట రాజమండ్రి

హోటల్ అక్షయ ఉడిపి వెజ్ :

శాఖాహారా రుచికరమైన భోజనం దొరికే బెస్ట్ ప్లేస్ ఇది

ఫేమస్ – ఉడిపి ఫుడ్

అడ్రస్- చల్ల పల్లి వారి వీధి సెయింట్ పాల్ స్కూల్ దగ్గర , త్యాగరాజ నగర్

restaurants in Rajahmundry

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *