tapeswaram kaja recipe
tapeswaram kaja recipe ,Tapeswaram kaja Special Story in Telugu ,

Tapeswaram kaja Special Story

Spread the love

 

తాపేశ్వరం ఈ పేరు చెప్పేగానే నోటిలో నీళ్లు ఊరే మడత కాజా గుర్తువస్తుంది చూస్తే తినేయాలి అనిపించేస్తుంది ఒకటి తింటే మరొకటి తినాలి అనిపిస్తుంది వేడి వేడి కాజా నుండి సర్రున పాకం కారుతుంటే సర్రున నోట్లోకి పోవాల్సిందే  tapeswaram kaja recipe 

పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో స్వీట్స్ తినేస్తూ ఉంటాం.  శుభకార్యాలు కు వెళితే చేపలెక్కర్లేదు ఇలా ఎన్ని రకాల స్వీట్స్ తిన్నా  తాపేశ్వరం (tapeswaram kaja ) మడత కాజా కి అంటూ ఒక ప్రత్యేకథ ఉంది

తాపేశ్వరం కాజా తయారీ వెనుక వున్నా కథ  :-

1939 లో తాపేశ్వరం కాజాను తయారుచేసి, దానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించి పెట్టిన ప్రముఖుడు పోలిశెట్టి సత్తిరాజు. ఆయన తూర్పుగోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలోని బ్రహ్మపూరి గ్రామానికి చెందినవారు.

అక్కడనుంచి ఉపాధి నిమిత్తం తాపేశ్వరం వలస వచ్చి మండపేటలొ మొదట మిఠాయి రామస్వామి అనే వ్యాపారి వద్ద పనిచేసేవారు. ఇక్కడే పిండివంటకాలు తయారు చేయడం నేర్చుకున్నారు. కొంతకాలానికి రామస్వామి అనారోగ్యకారణంతోవ్యాపారం మానేయగా సత్తిరాజు తాపేశ్వరంలో చిన్న హోటల్‌ నెలకొల్పారు.

ఆ హోటల్లో తాను నేర్చుకున్న కొన్నిరకాల మిఠాయిలు తయారుచేసి అమ్మేవారు. దాంతోపాటు వివాహది శుభకార్యాలకు పిండివంటలు తయారు చేసి అందించేవారు. ఆయన వంటలు వండేటప్పుడు రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఆయన మైదాపిండితొ మడతలుపెట్టి కాజాలను కొత్తరూపంలో తయారుచేసి, పంచదారపాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా అతి తక్కువకాలంలోనే ప్రాచుర్యములోకి వచ్చి తాపేశ్వరం కాజాగా ఖ్యాతి సంపాదించింది.

ఇలా వ్యాపారం అభివృద్ధి చెందటంతో 1970 తరువాత హోటల్‌ను విరమించుకుని శ్రీభక్తాంజనేయ స్వీట్‌ స్టాల్‌ను స్థాపించి, మిఠాయి వ్యాపారంపై దృష్టిపెట్టారు.

సేకరణ : ముఖపుస్తకం

ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా కాకినాడ గొట్టం కాజ ఎలా తయారు చేస్తారో నేర్చుకోవచ్చు 

ఈ నాడు ఈ తాపేశ్వరం కాజాగా తయారీ అనేది ఒక కుటీరపరిశ్రమగా మారినది. రాష్ట్రవ్యాప్తంగా తాపేశ్వరం కాజా పేరుతో 300 వరకు స్వీట్ స్టాల్స్ వివిధ పట్టణాలలో గలవు. దీనిపై సుమారు 15000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.

ఇంతటి ప్రఖ్యాతి కెక్కిన తినుబండారమును ప్రజలకందించిన పోలిశెట్టి సత్తిరాజు 1990లో స్వర్గస్థులైనారు. వీరి తరువాత వీరి భార్య భూషణం, ఆ తరువాత ప్రస్తుతం వీరి కుమారుడు పోలిశెట్టి మల్లిఖార్జునరావు (మల్లిబాబు) వ్యాపార నిర్వహణ చేపట్టారు

ఇప్పుడు  ఎలా తయారు చేస్తారో చూద్దామా ( tapeswaram kaja recipe ) : 

మరి ఆ కాజా ఎలా తయారు చేస్తారో చూద్దాం

ముందుగా కొంత మైదా 5 కేజీలుని తీసుకుని పిండి కలిపే మిషన్ గ్రైండింగ్ లో వేస్తారు
తరువాత  500grm ఆయిల్ వేస్తారు , 300 ml నీటిని పోస్తారు మిషన్ ఆన్ చేసి పిండి బాగా కలిసేలా తిప్పుతారు
బాగా ముద్దగా అయ్యాక బయటకి తీస్తారు

హ పిండిని మరొక మిషన్ లో వేడి పూరి లా రోల్ లా పొడవుగా వచ్చేలా చేస్తారు

మరొకసారి మిషన్ లో వేసి పొర పోరాలుగా వచ్చేలా చుట్టలా ముడుస్తారు ఇలా వచ్చిన పెద్ద పొర ని హ రోల్ ని చిన్న చిన్న ముక్కలుగా కాజా రూపంలో కట్ చేస్తారు ఇలా చుట్టడం వలనే మనకి కాజా లో పొర లు పొరలు గా వస్తాయి

హ చుట్టని తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు , హ ముక్కలను కాజా ఆకారం లో చపాతీ కర్రపెట్టి రుద్దుతారు

వీటిని తీసుకిని వేడి వేడి నూనెలో వేయిస్తారు మధ్య మధ్యలో నూనె వేడిని బట్టి నూనె పోసి ఫ్రై చేస్తారు

ఆ ముక్కలు చిన్న చిన్న పోరాలుగా విడిపోయి కాజా లాగా మారుతాయి

అన్ని ముక్కల్ని గోధుమ రంగు వచ్చేవరకు వేగించి బయటకి తీస్తారు అలా తీసిన కాజాల్ని వేడిగా ఉన్నప్పుడే యాలకులు కలిపిన పంచదార పాకలో వేస్తారు పాకం బాగా పట్టడానికి పెద్ద గరిటతో లోపలికి నొక్కి ఉంచుతారు

పంచదార పాకం 5 నిమిషాలు పీల్చుకోగానే తియ్యని తాసేశ్వరం కాజా  రెడీ అయినట్టు ( tapeswaram kaja recipe )

తాపేశ్వరం కాజా మొదట సురుచి ఫుడ్స్ లో తయారయింది ఈ సురుచి ఫుడ్స్ వాళ్లే ఖైరతాబాద్ గణేష్ కి ప్రతి ఏటా లడ్డు ప్రసాదం తయారు చేస్తారు

మొదట కాజా అనేది ఒరిస్సాలో ని పూరి క్షేత్రం లో ప్రసాదంగా అందజేసేవారు అప్పుడు కాజా పాకం ఏమి లేకుండా డ్రై గా ఉండేది తరువాత దాన్ని పాకమ్ కలిపి తియ్యగా అందజేశారు

స్వీట్ అనగానే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది కాజా అయితే కాజా అనగానే మొదట గుర్తొచ్చేది తాపేశ్వరం మడత కాజా….. ఈ జిల్లాకు ఎవరు వచ్చినా మొట్టమొదట అడిగేది తాపేశ్వరం ఎక్కడ తాపేశ్వరం కాజా ఎక్కడ దొరుకుతుంది అని..,..

. ద్వారపూడి కి 6 కిలోమీటర్ల దూరంలో మండపేట పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ మరియు భక్తాంజనేయ స్వీట్స్ వారు అసలు సిసలైన తాపేశ్వరం కాజా అమ్మడం జరుగుతుంది..
..
సినీ హీరోలు,రాజకీయ నేతలు గోదావరి జిల్లాలకు వస్తే తాపేశ్వరం కాజా తినకుండా ఎవరు వెళ్లరు…ఖైరతాబాద్ గణపతి చేతిలో ప్రతి సంవత్సరం ఈ తాపేశ్వరం వారు తయారు చేసిన లడ్డు..ఉంచేవారు…..

మీరు కూడా ఇలా వస్తే ఒకసారి సందర్శించండి…

పోటో సేకరణ : ముఖపుస్తకం

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *