theme restaurants in Hyderabad
theme restaurants in Hyderabad

Best theme restaurants in Hyderabad

Spread the love

కొత్త రుచులు ఆస్వాదించడం లో హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడు ముందుంటారు ఎక్కడ ఏ కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన అక్కడకి వెళ్లి ఒక్కసారైనా టేస్ట్ చేస్తారు ఆరోగ్యం పై అవగాహనతో టేస్టీ ఫుడ్ తో పాటు హోటల్ థీమ్స్కి ( Best Theme restaurants in Hyderabad  ) కూడా ఫిదా అవుతున్నారు సిటీ జనం

సిటీ ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ద చూపిస్తున్నారు. సాంప్రదాయ రుచులను ఇష్టపడుతున్నారు. దాంతో హోటల్ నిర్వాహకులు ప్రజలకు పల్లె వాతావరణం తో ట్రెడిషినల్ ఫుడ్ అందించేందుకు పోటీ పడుతున్నారు . నగరంలో కొత్తగా వెలుస్తున్న రెస్టారెంట్స్ లలో చాలా వరకు వంటకాల పేర్లతో ఉండటం భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి . అందుకోసం హోటల్ లుక్ కూడా మార్పు చేస్తున్నారు నిర్వాహకులు చల్లదనానికి వెదురుతాడకలతో పై కప్పు రాగి గ్లాస్ లో వాటర్ , రోబోట్ ల తో పుడ్ సర్వ్ చేయించడం, అడవి లో వుండే చెట్లు , జంతులు వంటి డిజైన్ లు తో హోటల్ లుక్ ని మార్చడం ఒక ఎత్తైతే భూమి నుండి 60 అడుగుల ఎత్తులో క్లౌడ్ డైనింగ్ పేరుతో సర్వ్ చేస్తున్నారు నిర్వాహకులు .ఇవే కాక ఇంకా జైల్ లో భోజనం చేసినట్టు ఉండేలా , చీకటి గుహలు లో ఆహారం తినేలా భోజన ప్రియులకు నచ్చిన విధంగా వారిని ఆకట్టుకునే విదంగా రెస్టారెంట్ ని మార్పులు చేసుకుంటున్నారు .

మరి అలాంటి వింతైన థీమ్స్ తో రూపుదిద్దుకున్న సిటీ లో ని పది రెస్టారెంట్ లు ఏంటో ఒక లుక్  వెద్దామా..

పది  బెస్ట్ థీమ్ రెస్టారెంట్ లు హైదరాబాద్ లో (theme restaurants in Hyderabad) 

 

1- దా రోబోట్ కిచెన్

థీమ్ -రోబోట్

స్పెషల్ – రోబోట్ ఫుడ్ సర్వ్ చేస్తాయి

అడ్రస్ – 2వ ఫ్లోర్ , ఆల్కజర్ మాల్ రోడ్ , రోడ్ నెం -36 – జూబ్లీహిల్స్

హైదరాబాద్ లో తప్పక ట్రై చేయాల్సిన 13 రకాల ఫుడ్స్ ఇవే (Hyderabad best food in Telugu ) :

2- ఫ్లాట్ ఫామ్ 65

థీమ్ – ట్రైన్ ఫ్లాట్ ఫామ్

స్పెషల్ – చిన్న ట్రైన్ ద్వారా ఫుడ్ సర్వ్ చేస్తారు

అడ్రస్ – 3 వ ఫ్లోర్ , పి ఎన్ ఆర్ ఎంపిరియర్ బిల్డింగ్ , కూకట్ పల్లి

 

3- క్లౌడ్ డైనింగ్

థీమ్ – క్లౌడ్ డైనింగ్

స్పెషల్ – 160 అడుగుల ఎత్తులో క్రేన్ ద్వారా డైనింగ్ ఏర్పాటు చేసి ఉంటుంది ఆకాశం లో ఫుడ్ తినే అనుభూతిని పొందవచ్చు

అడ్రస్ – సర్వ్ నెం -68 హైటెక్ సిటీ రోడ్ శిల్పారామం

4- గిస్మాత్ అరేబియన్ జైల్ మండి రెస్టారెంట్

థీమ్ – జైల్

స్పెషల్ – సంకెళ్లు వేసి జైల్ లోపలి కి తీసుకువెళ్లి జైలు లా వుండే ఒక రూమ్ లో వేస్తారు అక్కడే కావాల్సిన ఆహారాన్ని సర్వ్ చేస్తారు జైల్ లో ఆహారం తినే అనుభూతి పొందవచ్చు

అడ్రస్ – 2nd ప్లోర్ , pnr ఎంపిరే , కలమందిర్ ప్రక్కన , కూకట్ పల్లి ,

 

5- ఓహ్ రీస్ గుఫ్ఫా

థీమ్ – గుఫ్ఫా

స్పెషల్ – చీకటి గా వుండే గుహలో , క్యాండిల్ కాగడా లైట్ల వెలుతురుతో డైనింగ్ సెట్ చేసి ఉంటుంది గుహలో ఆహారం తిన్న అనుభూతి పొందుతాము

అడ్రస్ – పాత గాంధీ మెడికల్ కాలేజ్ ఎదురు బషీర్ బాగ్

6- డి ఈ ఫారెస్టు థీమ్ రెస్టారెంట్

థీమ్ – ఫారెస్ట్

స్పెషల్ – అడవులలో వుండే విధంగా చెట్లు మధ్య లో జంతువుల ఆకారం లో బొమ్మలు , కోయ మనుషుల లా స్వాగతం పలికే సెక్యూరిటీ గార్డ్ లు అడవి లో ఆహారం తిన్న అనుభూతిని పొందవచ్చు

అడ్రస్ – మెయిన్ రోడ్ , శ్రీ కృష్నా స్వీట్స్ పైన అమీర్ పేట్

7- విలేజ్ సోల్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్

థీమ్ – విలేజ్

స్పెషల్ – పాతకాలపు జ్ఞాపకాలు గుర్తు చేసుకునేలా పాత కాలపు పల్లెటూరి ఇల్లు , స్కూటీ లు , ఆటో లు , ట్రైన్ లు ఇవన్నీ ఒకే చోట ఉంటాయి విలేజ్ జాతర లో స్టాల్ పెట్టి అమ్మినట్టు సర్వ్ చేస్తారు
పాత పల్లెటూరి జ్ఞాపకలోకి తీసుకెళ్తుంది

అడ్రస్ – 3 వ ఇన్ ఆర్బిట్ మాల్ , ఇన్ ఆర్బిట్ మాల్ రోడ్ , సాఫ్ట్ వేర్ యూనిట్ లే అవుట్ మాదాపూర్

8- సిల్వర్ మెట్రో

థీమ్ – మెట్రో

స్పెషల్ – మెట్రో ట్రయిన్ లా వుండే డైనింగ్ , మెట్రో ట్రాయిన్ లో ఒక బాక్స్ లో డైనింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది

మెట్రో ట్రైన్ లో తిన్నామనే ఫీలింగ్ కలుగుతుంది

అడ్రస్ – పాత గాంధీ మెడికల్ కాలేజ్ ఎదురు , బషీర్ బాగ్

9- నటంకి గలి .

థీమ్ – బాలీవుడ్

స్పెషల్ – పాత కాలపు నాట్యమండలి రూపం లో బాలీవుడ్ తారలు ఫొటోలు తో కొత్త అనుభూతి పొందుతాము

అడ్రస్ – సైబర్ పెరల్ , హై టెక్ సిటీ ఫేజ్ 2 , హై టెక్ సిటీ

 

10- దా గ్రాండ్ ట్రంక్ రోడ్

థీమ్ – ట్రంక్ రోడ్

స్పెషల్ – పాత కాలపు టిప్పర్ లారీతో ముఖ ద్వారం స్వాగతం పలుకుతుంది , ఎక్కడ అక్కడ చిన్న పూరి గుడిసెలలో వుండే డైనింగ్ లారి లా వుండే బిల్ కౌంటర్ లు తో కొత్త అనుభూతిని పొందుతాము

అడ్రస్ – ఇమేజ్ గార్డెన్ రోడ్ , vip హిల్స్ , సిలికాన్ వ్యాలీ , మాదాపూర్

Best Theme restaurants in Hyderabad

Photos Source : Zomato ,lbb

Get Free E-Book
మీ ఈ మెయిల్ తో ఉచితంగా Subscribe చేసుకోవడం ద్వారా 1000 కి పైగా రుచికరమైన వంటలు గల 249/- రూపాయల విలువైన E-బుక్ ని ఉచితంగా పొందండి
We hate spam. Your email address will not be sold or shared with anyone else.
Summary
Best theme restaurants in Hyderabad
Article Name
Best theme restaurants in Hyderabad
Description
భోజన ప్రియులను ఆకట్టుకునే విదంగా రెస్టారెంట్లు
Author
Publisher Name
Telugu Foodies World
Publisher Logo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *